Fruits: డీహైడ్రేట్ కాకుండా కాపాడే ఈ ఫలాలను తింటున్నారా?

శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఎప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. మరి కేవలం నీటితోనే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు కదా! అందుకే మంచి నీళ్లతో పాటు ఈ నీటిని కూడా తినేయండి! అదేంటి? నీటిని ఎలా తింటారు అనుకుంటున్నారా! 

Updated : 20 Oct 2022 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఎప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. మరి కేవలం నీటితోనే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు కదా! అందుకే మంచి నీళ్లతో పాటు ఈ నీటిని కూడా తినేయండి! అదేంటి? నీటిని ఎలా తింటారు అనుకుంటున్నారా! నిజమే శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తూ, డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు దోహదపడే పండ్లు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

పుచ్చకాయ..

పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటుంది. వీలైనంత వరకూ ఈ పండును తింటూ ఉండండి. దీంతో చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఖర్బూజ పండు..

నీటి శాతం ఎక్కువగా ఉండే ఫలాల్లో ఖర్బూజ కూడా ఒకటి. ఇందులో 89 శాతం నీరుంటుంది. యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో శరీరానికి శక్తినిస్తుంది. డీహైడ్రేట్‌ కాకుండా కాపాడుతుంది. 

నారింజ

సీ విటమిన్‌ పుష్కలంగా ఉండే ఫలాల్లో నారింజ ఒకటి. నిమ్మజాతి పండ్లలో ఆరోగ్యానిచ్చే గుణాలు ఎక్కువగా ఉంటాయి. 

అనాస పండు..(పైనాపిల్‌)

శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు అనాస పండులో దొరుకుతాయి. అనాస పండులో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఉంటుంది.

స్ట్రాబెర్రీ..

స్ట్రాబెర్రీల్లో 90 శాతం నీరుంటుంది. శరీరానికి తక్షణ శక్తి కోసం ఈ స్ట్రాబెర్రీలను తింటే మంచి ఫలితాలుంటాయి. 

కీరదోస..

కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరానికి చల్లదనం చేకూరుతుంది. జ్యూస్‌లు చేసుకుని తాగటం కన్నా పండ్లను నేరుగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. జ్యూస్‌ చేస్తే వాటిల్లో ఉండే పీచు పోతుంది. అందువల్ల పండ్లను నేరుగా తింటేనే పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని