Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.

Published : 26 Jun 2024 19:03 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-2 పంపుహౌజ్‌ మరమ్మతుల కారణంగా కొన్ని చోట్ల పూర్తిగా, మరి కొన్ని చోట్ల పాక్షికంగా నీటి సరఫరా నిలిపివేయనున్నట్టు జల మండలి అధికారులు వెల్లడించారు. ఎల్బీనగర్‌, బాలాపూర్‌, సికింద్రాబాద్‌, బేగంపేట్‌, ఉప్పల్‌, రామంతపూర్‌, బుద్వేల్‌, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయమేర్పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని