Cyclone Asani: వాయుగుండంగా బలహీనపడిన ‘అసని’.. కానీ.!

‘అసని’ తుపాను మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీనపడింది. గత ఆరు గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే

Updated : 12 May 2022 10:46 IST

అమరావతి: ‘అసని’ తుపాను మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీనపడింది. గత ఆరు గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడింది. కొన్ని గంటలు ఇదే ప్రాంతం చుట్టూ తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45- 55 కి.మీ. వేగంలో గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను బలహీన పడినప్పటికీ ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రెండు రోజులుగా కలవరపెట్టిన ‘అసని’ తీవ్ర తుపాను.. బుధవారం ఉదయానికి తుపానుగా బలహీనపడింది. రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారి.. మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని