Updated : 08 Jul 2022 17:58 IST

Telangana News: విస్తారంగా వర్షాలు.. తెలంగాణలో రెండ్రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల రెండు రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నం తెలిపారు. గడిచిన 24గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశామని వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కన్నా 45శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వివరించారు. 

రాగల మూడు గంటల్లో.. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీమ్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్‌, హనుమకొండ, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్‌, సూర్యాపేట, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణ్‌పేట్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం పేర్కొంది. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts