Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Published : 22 Sep 2023 15:56 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్‌లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జార్ఖండ్‌ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం చత్తీస్‌గఢ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోకి క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు