
Published : 13 Apr 2021 16:36 IST
తెలంగాణలో మూడురోజులు వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో గాలులు వీస్తూ వడగండ్ల వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. రేపు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇవీ చదవండి
Tags :