Weather: మూడు రోజులపాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు!

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా మోస్తరువర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు.

Updated : 06 Jun 2023 15:03 IST

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో స్థిరంగా ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్‌ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు పేర్కొంది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు