తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు..

Published : 21 Apr 2021 15:46 IST

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ రోజు ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే రాయలసీమలోనూ ఒకట్రెండు చోట్ల వర్షాల పడతాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని