IMD: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణలో రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర (IMD) సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Published : 11 Dec 2022 15:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అక్కడక్కడ రేపు ఉరుములతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. అదేవిధంగా రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిన్న ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి.. సాయంత్రం వాయుగుండంగా, ఇవాళ ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందని వివరించారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం కూడా బలహీనపడిందని వెల్లడించారు.

ముసురుపట్టిన భాగ్యనగరం..

మరోవైపు మాండౌస్‌ (Mandous Cyclone) తుపాను ప్రభావంతో భాగ్యనగరమంతా ముసురుపట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, బషీర్ బాగ్, లక్డీ కపూల్‌, నాంపల్లి, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్ తదితర ప్రాతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు, బాటసారులు తడిసిముద్దయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని