పెళ్లి పెద్దలకు కప్పగంతుల తాంబూలం

వాళ్లంతా వధూవరులను ఆశీర్వదించి, పెళ్లి భోజనం తిని సంతోషంగా తిరిగి వెళదామనుకున్నారు. కానీ వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టింది. పెళ్లిలో తిన్నది అరిగేంత వరకూ వాళ్ల చేత కప్పగంతులు వేయించారు పోలీసులు.

Published : 20 May 2021 20:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  వాళ్లంతా వధూవరులను ఆశీర్వదించి, పెళ్లి భోజనం తిని సంతోషంగా తిరిగి వెళదామనుకున్నారు. కానీ వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టింది. పెళ్లిలో తిన్నది అరిగేంత వరకూ వాళ్ల చేత కప్పగంతులు వేయించారు పోలీసులు. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ జిల్లాలోని ఉమరి గ్రామంలో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా 300 మంది అతిథులు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీ చేయడానికి వెళ్లారు. పోలీసులు రావడం గమనించిన కొందరు అతిథులు అక్కడి నుంచి తప్పించుకోగా.. కొంతమంది మాత్రం దొరికిపోయారు. దొరికిన 17 మందికి శిక్షగా రోడ్డు మీద కప్పగంతులు వేయించారు పోలీసులు.  

ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో కొత్తగా 5,065 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా వీటితో కలిపి మొత్తం కరోనా కేసులు 7.47 లక్షలకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7,227 కరోనా మరణాలు సంభవించాయి.  


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts