weekoff: వారాంతపు సెలవు.. ఎలాంటి ప్లాన్స్‌ వేసుకుంటున్నారు!

వారం రోజులు అదే తీరుగా పని.. భోజనం చేసేందుకు కూడా తీరికుండదు. పని ఒత్తిడి అలాంటిది మరి! ఈ పని బిజీలో ఒక రోజు వారాంతపు సెలవు దొరుకుతుంది. దీనిని ఎలా ఉపయోగించుకుంటున్నారు.

Published : 13 Oct 2022 11:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారం రోజులు అదే తీరుగా పని.. భోజనం చేసేందుకు కూడా తీరికఉండదు. పని ఒత్తిడి అలాంటిది మరి! ఈ పని బిజీలో ఒక రోజు వారాంతపు సెలవు దొరుకుతుంది. దీనిని ఎలా ఉపయోగించుకుంటున్నారు. మిగతా రోజులు ఎలాగూ సంపాదించేందుకు వాడుతున్నారు. కనీసం ఒక్కరోజైనా మీరు ఆనందంగా ఉండేందుకు ఉపయోగించుకుంటున్నారా! 

చాలామంది సెలవు రోజు ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. అలా కాకుండా ఉదయం తొందరగా నిద్ర లేస్తే ఎక్కువ సమయం మీ చేతుల్లో ఉంటుంది. దీంతో ఎక్కువ పనులు చేసుకోవచ్చు. 

పని వేళల్లో ఎలాగూ లాప్‌టాప్‌లు, ఫోన్‌లతో కుస్తీ పట్టడానికే సమయంతా అయిపోతుంది. సెలవు రోజు కూడా వాటితోనే గడిపితే ఎలా? అందుకే వారాంతపు సెలవుల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను దూరం పెట్టేయండి. అత్యవసరమైతే తప్ప వాటిని వాడకుండా ఉండండి. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపండి. 

* ఇంట్లో వాళ్లు, పిల్లలు, స్నేహితులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లండి. వాళ్లతో సమయం గడిపినట్లు ఉంటుంది. మీకూ మనసుకి హాయిగా ఉంటుంది. 

* ఏదైనా క్రియేటివ్‌గా ఉండే, మీకు నచ్చే పనిని చేయండి. అవుట్‌ డోర్‌ గేమ్స్‌, ఇండోర్‌ గేమ్స్‌, పెయింటింగ్ వంటివి చేయండి.

* మీతో మీరు కాసేపు సమయం గడపండి. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు వేసుకోండి. భవిష్యత్తులో ఏ పని చేయాలనుకుంటున్నారో మీ డైరీలో రాసుకోండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని