Weight Gain: బరువు పెరుగుతున్నారా! కారణాలేంటో తెలుసుకోండి!

బరువు పెరగటం.. చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. సమస్య తలెత్తిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కదా! ఆ జాగ్రత్తలేమిటో మీరూ తెలుసుకోండి. 

Published : 26 Oct 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బరువు పెరగడం.. చాలామందిని వేధించే సమస్య. బరువు తగ్గాలని అనేకమంది నానా అవస్థలూ పడుతుంటారు. కానీ బరువు పెరిగిన తర్వాత ఇబ్బందులు పడటం కంటే.. బరువు ఎందుకు పెరుగుతారో కారణాలు తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు కదా! మరి బరువు పెరగడానికి కారణాలేంటో చూద్దామా? 

  • డిప్రెషన్‌.. ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఒంటరితనంతో మానసికంగా కుంగిపోయేవారు ఎక్కువగా బరువు పెరుగుతున్నారట!
  • ఒత్తిడి.. పని సకాలంలో పూర్తి చేయాలని, ఇంటి బాధ్యతలు.. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. దీంతో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతారట!
  • థైరాయిడ్‌ సమస్య.. ఆరోగ్య వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు సరిగ్గా ఉండాలి. దీంట్లో ఏ మాత్రం హెచ్చు తగ్గులు వచ్చినా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటుంది. దీంతో శరీరం బరువు పెరిగేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయి.
  • ఆహారం రుచిగా ఉండాలని, చూసేందుకు ఆకర్షణీయంగా ఉండాలని రకరకాల రంగులు కలుపుతుంటారు. దీనివల్ల కూడా బరువు పెరుగుతుంటారు. అందువల్ల ఆహారాన్ని సహజంగా ఉండేలా జాగ్రత్త పడటం అవసరం. 
  • మందులు... కొందరు ప్రతి చిన్నదానికి మందులు వాడుతుంటారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉందట! అందుకే అనవసరంగా మందుల వాడకం తగ్గించాలి. 
  • ప్రస్తుతం అన్ని పనులూ యాంత్రికమైపోయాయి. దీంతో శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండట్లేదు. దీనికి తోడు గంటల తరబడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే సమయం గడుపుతున్నారు. బరువు సులువుగా పెరిగేందుకు ఇదీ ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
  • శరీర అవసరానికి మించి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే సులువుగా బరువు పెరుగుతారు. తినే ఆహారాన్ని బట్టి కూడా బరువు పెరుగుతుంటారు.
  • జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటే సులువుగా బరువు పెరుగుతుంటారు. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి.
  • ఆల్కహాల్‌ తాగటం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతారు. దీనివల్ల శరీరంలో అనవసరపు కొవ్వు చేరుతుంది.
  • తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పు చేర్చుకున్నా బరువు పెరిగేందుకు కారణమవుతుంది. 
  • అర్ధరాత్రి తినడం... ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవటం.. పూర్తి జీవనశైలిలో మార్పులు వచ్చేశాయి. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువైపోతున్నాయి. సమయానికి భోజనం చేస్తే ఇలాంటి ఇబ్బందులు దరిచేరవు. 
  • వ్యాయామాలు చేయాలి. కేవలం జిహ్వరుచి కోసం కాకుండా శరీరం దృఢంగా ఉండేందుకు అవసరమైన ఆహారాన్నితీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని