Medicines: ఈ మందులతో బరువు పెరగొచ్చు..? జాగ్రత్త సుమా..!

ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినపుడు దానికి సంబంధించిన మందులు వేసుకోక తప్పదు. ఇపుడు మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్‌, క్యాన్సర్‌ లాంటి జబ్బులకు దీర్ఘకాలంగా మందులు వాడక తప్పదు.

Updated : 07 Oct 2022 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినపుడు దానికి సంబంధించిన మందులు వేసుకోక తప్పదు. ఇపుడు మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్‌, క్యాన్సర్‌ లాంటి జబ్బులకు దీర్ఘకాలంగా మందులు వాడక తప్పదు. వీటితో పాటు పారాసిటామాల్‌, నొప్పి మాత్రలు, యాంటీబయోటిక్స్‌, ఇతర మందులు వేసుకోవడం ఎక్కువయ్యింది. ఇందులో కొన్ని మందులతో బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వీటి తీరుతెన్నులు, పరిష్కార మార్గాల గురించి జనరల్‌ ఫిజిషియన్‌, డయాబెటాలజిస్టు డాక్టర్‌ దిలీప్‌ నందమూరి వివరించారు.

ఇవీ తేడాగానే ఉంటాయి...

* కొన్ని బీపీ, షుగర్‌ మందులు ఒంటి బరువును పెంచుతాయి. మానసిక రుగ్మతల నివారణకు వాడే మందులతో కూడా బరువు పెరగొచ్చు.

* పక్షవాతం, రుమాటైటీడ్‌, యాంటీఈస్టామెన్‌ మందులతో కూడా బరువు పెరుగుతారు.

* గ్లూకోజ్‌ పెంచడానికి ఇచ్చే మధుమేహం మందులతో కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది.

* మూర్ఛను తగ్గించే మందులకు ఆకలిని పెంచే గుణం ఉంటుంది. దాంతో ఎక్కువగా తినేస్తుంటారు.

* జలుబు తగ్గించే సిట్రజిన్‌ మందు బిళ్లలు ఆకలిని, బద్దకాన్ని పెంచుతాయి. వీటితో కూడా బరువు పెరగక తప్పదని తెలుస్తోంది.

* ఏ మందులు వాడినా సైడ్‌ఎఫెక్టు వచ్చినపుడు వెంటనే వైద్యులను కలుసుకోవాలి.దీంతో ఇతర అవసరమైన మందులను సూచించే అవకాశం ఉంటుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని