Weight Loss: లావుగా ఉన్నామని చింతిస్తున్నారా...? ప్రత్యామ్నాయం ఉంది కదా..!

లావు.. ఇదొక సమస్యగా మారిపోయింది. పెళ్లయినా, కాకపోయినా అధిక బరువుతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆహారం తగ్గించినా, మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండటం లేదని బాధ పడుతున్నారు.

Published : 12 Aug 2022 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లావు.. ఇదొక సమస్యగా మారిపోయింది. పెళ్లయినా, కాకపోయినా అధిక బరువుతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆహారం తగ్గించినా, మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండటం లేదని బాధ పడుతున్నారు. కానీ కొన్నిసార్లు చేయాల్సిన వ్యాయామం, ఆహార నియమాలు కాకుండా మందులపై ఆధార పడటంతో బరువు అదుపులోకి రావడం లేదు. ఎంతకీ తగ్గని అధిక బరువును తగ్గించేందుకు ఆధునిక పద్ధతులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి బెరియాట్రిక్‌ సర్జరీ. దీనికి శారీరక సమస్యలు, అనారోగ్యం లేకపోతే హాయిగా బరువు తగ్గొంచని సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ మహిధర్‌ తెలిపారు. మధుమేహం కూడా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వస్తుందని చెబుతున్నారు.

ప్రయోజనాలెన్నో

* అధిక బరువును తగ్గించుకోవడంతో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

* బరువు పెరగడంతో వచ్చే మధుమేహం నియంత్రించడానికి వీలుంది. చాలా కేసుల్లో మధుమేహ బాధితులు అధిక బరువుతో ఉన్న వాళ్లేనని స్పష్టమయ్యింది.

* బెరియాట్రిక్‌ సర్జరీ అయిన మూడునెలల తర్వాత బరువు తగ్గుతుంటారు. దాంతో పాటే మధుమేహం అదుపులోకి వస్తుంది. కొందరికి మందులు వాడే అవసరం కూడా ఉండదు.

* వ్యాయామంతో పాటు జీవనశైలి మార్చుకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని