Heart Attack: గుండెపోటు వచ్చినపుడు ఏం చేయాలంటే..!

గుండెపోటు వచ్చినపుడు ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే అంత మంచిది. లేకపోతే గుండె కండరాలు చచ్చుబడిపోతాయి.

Published : 13 Oct 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుండెపోటు రావడమనే మాట వింటేనే హడలిపోతాం. అయితే.. నిజంగా వస్తే ఏం చేయాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి. తినే ఆహారంతో పాటు చేయాల్సిన వ్యాయామంపై దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. గుండెపోటు వచ్చినట్టు అనుమానం వస్తే కంగారు పడకుండా సకాలంలో ఆసుపత్రికి వెళ్లడానికి సిద్ధం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాలపైకి వచ్చే ఈ సమస్యకు వేగంగా స్పందించాలని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి పేర్కొన్నారు.

ఎలా ఉంటుందంటే...

ఏదో ఒక రక్తనాళం ఆకస్మాత్తుగా మూసుకొని పోవడంతో గుండెపోటు వస్తుంది. దానితో గుండెలో ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోతుంది. గుండెపోటు వచ్చినపుడు ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే అంత మంచిది. లేకపోతే గుండె కండరాలు చచ్చుబడిపోతాయి. 

లక్షణాలు ఇలా...

* ఛాతీలో నొప్పి, చేయి లాగినట్టు ఉండటం, దవడనొప్పి ఉంటుంది. గుండెలో మంటగా అనిపిస్తుంది. దడ, ఆయాసం వస్తుంది. వీటితో పాటు బాగా చెమట పడుతుంది. వికారంగా ఉంటుంది. వాంతులు కూడా అవుతాయి. అందరికీ ఒకే రకమైన లక్షణాలుండవు.

ఏం చేయాలంటే..

ఏదైనా పని చేస్తున్నపుడు గుండెపోటు వస్తే వెంటనే చేస్తున్న పని ఆపేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. అనుమానం ఉన్నపుడు సొంతంగా వాహనాన్ని నడుపుకొంటూ వెళ్లొద్దు. వీలైతే 108కి ఫోన్‌ చేయాలి. లేదంటే స్నేహితులకు సమాచారం ఇవ్వాలి. గుండె సమస్య ఉన్నవారయితే సార్బిట్రేట్‌ ట్యాబ్లెట్‌ను నాలుక కింద పెట్టుకోవచ్చు. అనుమానం ఉన్న వారు వాడితే బీపీ తగ్గిపోయి పడిపోవచ్చు. సీపీఆర్‌ను గుండె ఆగిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నపుడు చేయొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని