Type 1 Diabetes: డయాబెటిస్ పేషెంట్లు ఇన్సులిన్ తీసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
గత మూడు దశాబ్దాల్లో భారత్‌లో ఈ సంఖ్య 150 శాతం పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు టైప్-1 డయాబెటిస్‌పై నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?
దిల్లీ: దేశవ్యాప్తంగా రోజురోజుకీ డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత మూడు దశాబ్దాల్లో భారత్‌లో ఈ సంఖ్య 150 శాతం పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు టైప్-1 డయాబెటిస్‌పై నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచంలోని డయాబెటిస్ బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపింది. ప్రతి ఆరుగురి డయాబెటిస్ పేషెంట్లలో ఒకరు భారతీయులున్నారని పేర్కొంది. అలాగే కరోనా వైరస్‌తో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించడానికి డయాబెటిస్ కూడా ఓ కారణమని ఐసీఎంఆర్ తెలిపింది.
టైప్-1 డయాబెటిస్ అంటే?
ఇన్సులిన్ హార్మోన్‌ను క్లోమగ్రంథి తయారు చేయకపోవటం వల్ల టైప్ 1 మధుమేహం వస్తోంది. ఈ తరహా మధుమేహం చిన్న వయసు (15ఏళ్లలోపు)పిల్లల్లో వస్తుంది. పెద్దల్లోనూ వచ్చే అవకాశం ఉంటుంది. దేశంలో టైప్-1 మధుమేహ బాధితుల సంఖ్య ఏటా 10 వేల వరకూ పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో 2.5 లక్షల మంది వరకు బాధితులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఇన్సులిన్ స్టోరేజీ ఎలా?
📌 ఇన్సులిన్‌ను కొనుగోలు చేసే ముందు దాని గడువు తేదీని(expiry date) చెక్ చేసుకోవాలి. ఇన్సులిన్‌లో గడ్డలు కానీ, రంగులో మార్పు వంటివి ఉన్నాయా? లేదా? చూశాకే కొనుగోలు చేయాలి.
📌 ఇన్సులిన్‌ను ఫ్రిజ్లోనే నిల్వ ఉంచాలి. సూర్యకాంతి పడకుండా జాగ్రత్త పడాలి.
📌 ఒకసారి ఓపెన్ చేసిన ఇన్సులిన్ బాటిల్‌ను గది ఉష్ణోగ్రత (25 డిగ్రీల) వద్ద ఒక నెలపాటు నిల్వ ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఇన్సులిన్‌ను నిల్వ చేసినట్లయితే దాని సామర్థ్యాన్ని ఒక శాతం వరకు కోల్పోతుంది.
📌 తాజా మార్గదర్శకాల్లో ఇన్సులిన్ పిన్స్‌కు నీడిల్స్ గుచ్చి ఉంచవద్దని.. అలా ఉంచినట్లయితే దానిలోపలికి గాలివెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొంది.
📌 అలాగే పిల్లలు, వయోజనులు వాడే నీడిల్స్ పొడవు 4 నుంచి 6 మిల్లీమీటర్లు ఉండాలని ఐసీఎంఆర్ సూచించింది. అదేవిధంగా ఇన్సులిన్‌ను 90 డిగ్రీలకు బదులు 45 నుంచి 60 డిగ్రీల కోణంలో ఇంజెక్ట్ చేయాలని చెప్పింది.
ఇంజెక్ట్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
📍 ఇన్సులిన్‌ను ఇంజెక్ట్ చేసేటపుడు డయాబెటిస్ పేషెంట్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముంజేయి(forearm), కాళ్ల పిక్కల(calves)పై ఇంజెక్ట్ చేసుకోవద్దని సూచించింది.
📍 సాధారణంగా డయాబెటిస్ పేషెంట్లు శరీరంలోని ఒకే ప్రాంతాన్ని ఎంచుకొని సమయానుసరంగా ఇంజెక్షన్స్ వేసుకుంటారు. అలాకాకుండా మొదటిసారి ఇంజెక్ట్ చేసుకున్న ప్రాంతానికి రెండోసారి ఇంజెక్ట్ చేసే ప్రాంతానికి 0.5 - 1.0 అంగుళాల దూరం ఉండాలని ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్