Whatsapp: వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయం!

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలు గత కొన్ని గంటల నుంచి నిలిచిపోయాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ...

Updated : 05 Oct 2021 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలు గత కొన్ని గంటల నుంచి నిలిచిపోయాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ నుంచి సందేశాలు వెళ్లడం, రావడం పూర్తిగా నిలిచిపోయాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో సైతం ఫీడ్‌ రీఫ్రెష్‌ అవ్వడం లేదు. దీంతో పలువురు యూజర్లు ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా పనిచేయడం లేదంటూ పోస్టులు పెడుతున్నారు.

సేవలకు అంతరాయం ఏర్పడడంపై ఫేస్‌బుక్‌ స్పందించింది. ‘‘క్షమించాలి. ఏదో తప్పిదం జరిగింది. దానిపై మేం పనిచేస్తున్నాం. సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తాం’’ అని పేర్కొంది. వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తమ దృష్టికి వచ్చినట్లు వాట్సాప్‌ సైతం ట్వీట్‌ చేసింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఫేస్‌బుక్‌కు చెందినవే కావడం గమనార్హం. భారత్‌లో ఫేస్‌బుక్‌కు 41 కోట్ల మంది యూజర్లు ఉండగా.. 53 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. 21 కోట్ల మంది ఇన్‌స్టాను వాడుతున్నారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని