Knee Problem: మోకాళ్ల నొప్పులా..? ఇలా చేయండి

వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు పెద్ద సమస్యగా మారిపోయింది. 

Published : 07 Jul 2022 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు పెద్ద సమస్యగా మారిపోయింది. పోటెత్తే మోకాళ్ల నొప్పులతో వయసు పైబడిన వారికి మరీ దుర్భరంగా ఉంటోంది. నడవడమే కాదు..కూర్చోవడం ఇబ్బందికరంగానే ఉంటోంది. మోకీళ్లు అరిగిపోవడంతో పాటు గుజ్జు తగ్గిపోవడంతో నొప్పులు అధికం అవుతున్నాయి. ఈ నొప్పులను భరించలేక అనేక రకాల మందులను, ఫెయిన్‌ కిల్లర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ మోకాళ్ల నొప్పులకు ఏం చేయాలో జాయింట్‌ నీ రీ ప్లేస్‌మెంట్‌ సర్జన్‌ వెంకటరమణారెడ్డి వివరించారు.

ఆర్థరైటిస్‌తోనే నొప్పి

మోకాళ్ల నొప్పులు రావడానికి ఎన్ని కారణాలున్నా ప్రధానంగా ఆర్థరైటిస్‌తోనే సమస్యలు వస్తాయి. స్టేజ్‌1, 2, 3 స్టేజీలలో వచ్చే నొప్పులకు మందులతోనే సరిపోతుంది. మోకాళ్ల నొప్పులు వస్తాయని మోకీలు రీప్లేస్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణ జీవనం గడిపేవాళ్లకు ఈ శస్త్రచికిత్స చేయాల్సిన పని లేదు. మంచి ఆహారం, వ్యాయామం చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని