Health: మోకాళ్లకు సర్జరీ ఎప్పుడు?

మోకాళ్ల నొప్పితో బాధపడే వారు ఎక్కువ అయిపోతున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది మోకీళ్లు అరిగిపోయి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిలో గుజ్జు కూడా అరిగిపోయే పరిస్థితి వస్తుంది.

Updated : 09 Aug 2022 15:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసు పెరుగుతున్న కొద్ది మోకీళ్లు అరిగిపోయి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిలో గుజ్జు కూడా అరిగిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో మోకాళ్ల నొప్పులు ఎక్కువ అవుతూ  ఉంటాయి. సరిగా నడవలేరు. కూర్చోలేరు. 60 ఏళ్ల తరవాత మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. ఒక కేజీ బరువు పెరిగితే మూడు కిలోల బరువు మోకాళ్ల మీద పడుతూ ఉంటుంది. ఊబకాయం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ మోకాళ్ల నొప్పి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటి దశలో ఉంటే ఫరవాలేదు, కానీ వయసు పెరుగుతుంటే ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండటం మంచిది. మరీ నొప్పి ఎక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలి.  లేదంటే ఇంజక్షన్లు వాడవచ్చు. స్టెరాయిడ్ల ఇంజక్షన్‌లను వాడకపోవడం ఉత్తమం. ఇవేవి పని చేయనప్పుడు మోకాళ్లకు ఆపరేషన్‌ తప్పదు. మోకాలు మార్పిడి చేయించుకోవాలంటే ముందుగా ఏ స్టేజీలో ఉందో తెలుసుకోవాలి. 4 స్టేజీలో ఉన్నపుడు మాత్రమే ఆపరేషన్‌ చేయించుకోవాలి. ఆపరేషన్‌ చేయించుకున్న తరవాత కింద సాధ్యమైనంత వరకూ కూర్చోకూడదు. వ్యాయామం చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఇబ్బందిగా ఉండే వ్యాయామాలు చేయకూడదు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని