మిస్ ఇండియా.. మన తెలుగు ముద్దుగుమ్మ
ఫ్యాషన్ ప్రపంచంలో మన తెలుగింటి యువతి సత్తాచాటింది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన...
మానస వారణాసి గురించి కొన్ని విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: ఫ్యాషన్ ప్రపంచంలో మన తెలుగింటి యువతి సత్తాచాటింది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి (23) గ్లోబల్ ఇండియన్ స్కూల్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. వాసవీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు.
సిగ్గు, బెరుకు వల్ల చిన్నతనం నుంచి మానస చాలా తక్కువగా మాట్లాడేవారు. తన మనసులోని భావాలను బయటపెట్టడం కోసం ఆమె భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు.
ఫ్యాషన్ రంగంపై సరైన అవగాహన లేని సమయంలోనే కళాశాలలో జరిగిన పలు అందాల పోటీల్లో పాల్గొన్న మానస ర్యాంపుపై హోయలొలికించి పలు సందర్భాల్లో విజేతగా బహుమతులు అందుకున్నారు. 21 సంవత్సరాల వయసు నుంచి మోడలింగ్ రంగంపై దృష్టి సారించినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.
బామ్మ, అమ్మ, సోదరి.. ఈ ముగ్గురు మహిళలు తన జీవితంలో ఎంతో స్ఫూర్తినింపిన వ్యక్తులని మానస ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
2014 జూన్ 13 నుంచి మానస ఇన్‌స్టాలో ఖాతాను ప్రారంభించారు. సాధారణంగా సోషల్‌మీడియాలో తక్కువగా కనిపించే మానస.. సమయానుగుణంగా ఇన్‌స్టాలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఫొటోలు షేర్ చేశారు.
మానసకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. హాలీడే దొరికితే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.
ఆరోగ్యం, ఫిటెనెస్‌పై ఎక్కువ ఫోకస్ చూపించే ఈ మానస.. ఉదయాన్నే గోరువెచ్చటి నీరు సేవించి తన దినచర్యను ప్రారంభిస్తారట.
ఎప్పుడైనా ఒత్తిడి, మానసిక కుంగుబాటుకు లోనైతే.. దాని నుంచి బయటపడడం కోసం వెంటనే సంగీతంపై మనసు మళ్లిస్తారట. బాధ లేక సంతోషం అనేవి కేవలం ఆ క్షణానికే పరిమితమని.. కాబట్టి జీవితంలోని ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని మానస అంటుంటారు.
‘సౌందర్య ప్రపంచంలో ఎంతోమంది మహారాణులు ఉండొచ్చు. వారందరిలోకెల్లా ప్రియాంక చోప్రా అంటే నాకెంతో అభిమానం. సంగీతం, సినిమాలు, వ్యాపార రంగం, సామాజిక సేవ.. ఇలా ప్రతి విషయంలోనూ ఆమె తన పరిధిని పెంచుకుంటూ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. ఎన్నో సందర్భాల్లో భయం లేకుండా తన మనసులోని భావాలను ఆమె ధైర్యంగా బయటపెట్టింది. ఇలా ఆమె బహుముఖ ప్రజ్ఞ, ధైర్యం చూసి నేను ప్రేరణ పొందాను.’ అని ఓ ఇంటర్వ్యూలో మానస తెలిపారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!