Doctors: వైద్యులపై అపనమ్మకం ఎందుకో..?

వైద్యులంటే దైవానికి ప్రతిరూపంగా చూస్తాం. ప్రాణాంతక జబ్బులను నయం చేసి ప్రాణాలను నిలిపేందుకు శ్రమించేవారంటే ఎంతో గౌరవం ఇస్తాం..అలాంటి పరిస్థితి కొన్నిసార్లు సడలిపోతోంది. ఏదో ఒక చోట ఇబ్బందులు రావడంతో అందరినీ ఒకేగాటన కట్టేస్తున్నారు.

Published : 21 Jul 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైద్యులంటే దైవానికి ప్రతిరూపంగా చూస్తాం. ప్రాణాంతక జబ్బులను నయం చేసి ప్రాణాలను నిలిపేందుకు శ్రమించేవారంటే ఎంతో గౌరవం ఇస్తాం.. అలాంటి పరిస్థితి కొన్నిసార్లు సడలిపోతోంది. ఏదో ఒకచోట ఇబ్బందులు రావడంతో అందరినీ ఒకేగాటన కట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది..? దానితో కలిగే ఇబ్బందులెలా ఉంటాయో ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు ఎంబీవీ ప్రసాద్‌ చెప్పారు. 

అపోహలు వద్దు సుమా

ఇటీవల కాలంలో అపనమ్మకం, అపోహలు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రికి వెళితే ఏదో అయిపోతుందనే భావన పెరిగింది. సరైన చికిత్స చేస్తారో, లేదోనని భావిస్తున్నారు. లేనిపోని భయాలు, అనుమానాలు ఎక్కువయ్యాయి. కొన్నిసార్లు ఎంతటి అనుభవజ్ఞుడైన వైద్యడికి కూడా కొన్ని రోగాలు లొంగవు. ఈ సమయంలో వైద్యులను నిందించడం సరికాదు. ఇటీవల ఇబ్బందికర జబ్బులకు ఒక్క వైద్యుడే చికిత్స చేయడం లేదు. వైద్యుల బృందం కలిసి చర్చించి చికిత్స చేస్తున్నారు. ఇది కూడా రోగి శరీరం సహకరించినపుడే సాధ్యం అవుతుందని అందరూ గుర్తు పెట్టుకోవాలి. వైద్యులపై నమ్మకం పెట్టుకుంటే రోగం తొందరగా నయం కావడానికి ఆస్కారం ఉంటుంది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని