wife victims: భార్యా బాధితుల సంఘం ఆందోళన.. డిమాండ్లు ఇవే!

డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ భార్య బాధితుల సంఘం ఆందోళనకు దిగింది. కర్ణాటకలోని బెంగళూరులో భార్య బాధితుల సంఘం సభ్యులు రెండ్రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు.

Updated : 26 Feb 2023 19:41 IST

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో భార్య బాధితుల సంఘం ఆందోళన బాట పట్టింది. నగరంలోని ఫ్రీడం పార్క్‌లో సేవ్‌ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్‌తో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం ప్రారంభించిన దీక్ష ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లపై నినదించారు. చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు మహిళలు విదేశాల్లో ఉంటున్న భర్త తరఫు కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని కోరారు. విడాకులు తీసుకున్నప్పుడు వారి సంతానం ఇద్దరి వద్దా ఉండేలా చట్టాలను సవరించాలని డిమాండ్‌ చేశారు. 

తప్పుడు కేసులతో వేధించిన మహిళలకు శిక్ష విధించాలని, వృద్ధులైన అత్తామామలపై కోడళ్లు పెట్టిన కేసులు రద్దు చేయాలని, విడాకులు తీసుకున్న భార్య శ్రీమంతురాలై ఉంటే ఆమెకు భరణమిచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భార్య, అత్తింటి నుంచి వస్తున్న వేధింపులు తాళలేక పలువురు పురుషులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సంఘ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని