Assam:వ్యక్తిని తొండంతో ఈడ్చి పడేసిన ఏనుగు!

అసోంలోని ధుబ్రి జిల్లాలో ఏనుగు దాడి చేయడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తమర్‌హాట్ ప్రాంతంలో జనవాసాల్లోకి వచ్చిన ఏనుగు అక్కడున్న ప్రజలను తరమడం ప్రారంభించింది.

Published : 21 Dec 2021 12:54 IST

గువాహటి: అసోంలోని ధుబ్రి జిల్లాలో ఏనుగు దాడి చేయడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తమర్‌హాట్ ప్రాంతంలో జనవాసాల్లోకి చొరబడిన ఏనుగు అక్కడున్న ప్రజలను తరమడం ప్రారంభించింది. ఊర్లోకి వచ్చిన ఏనుగును చూసి స్థానికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఆ క్రమంలో 30ఏళ్ల వ్యక్తి కింద పడిపోయాడు. వెంటనే ఏనుగు అతడిని గాయపరిచింది. తొండంతో ఈడ్చిపడేసింది. దూరంగా ఉన్న స్థానికులు అరుపులతో ఎంత భయపెట్టినా బెదరలేదు. తర్వాత గజరాజు అక్కడి నుంచి వెళ్లిపోగా.. యువకుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని అటవీశాఖ అధికారి వెల్లడించారు. స్థానికులపై దాడిచేసిన ఏనుగు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు అధికారులు వివరించారు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని