Andhra News: 1064 బస్సులను ఆధునీకరిస్తాం: ఆర్టీసీ ఎండీ

ఏపీ వ్యాప్తంగా 1321 పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను రూ.15 కోట్లతో నవీకరణ చేసినట్లు ఎండీ తెలిపారు. సూపర్‌ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్ కలిపి మొత్తం 1064 బస్సులను వచ్చే మార్చి లోపు ఆధునీకరిస్తామనన్నారు.

Published : 11 Oct 2022 01:16 IST

అమరావతి: ‘బస్సులో గొడుగు’ శీర్షికన ఆదివారం ఈనాడులో ప్రచురితమైన వార్తకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సాలూరు డిపోకు చెందిన ఆల్ట్రా డీలక్స్‌ బస్సు టాప్‌ లీకేజీ జరిగిందని.. వెంటనే ఆ బస్సును ఆపి మరమ్మతులు చేపట్టామని ఆయన తెలిపారు. దీనికి కారణమైన సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. బస్సులన్నీ తనిఖీ చేసి, లీకేజీ ఉన్న బస్సులను వెంటనే ఆపివేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. మరమ్మతులు చేసిన తర్వాతే సర్వీసులు తిరిగి ప్రారంభించాలని సూచించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1321 పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను రూ.15 కోట్లతో నవీకరణ చేసినట్లు ఎండీ తెలిపారు. సూపర్‌ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్ కలిపి మొత్తం 1064 బస్సులను వచ్చే మార్చి లోపు ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. బస్సుల కండీషన్‌ను మెరుగుపరిచి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యవంతంగా మలుస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని