‘విండో’ నుంచి ప్రపంచాన్ని చూసేద్దామా!
కరోనా వల్ల పర్యాటక రంగం మొత్తం తుడిచిపెట్టుకోపోయింది. ఇల్లే దాటలేని ప్రస్తుత పరిస్థితిలో విదేశాల్లో విహారయాత్రలు, ప్రకృతి ఒడిలో సేద తీరడాలు కలే. బయటకు వెళ్తే కరోనా ఎక్కడా సోకుతుందోనని చాలా మంది ఇంటికే పరిమతయ్యారు. ఇంటి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా పర్యాటక రంగం తీవ్రంగా కుదేలైంది. ఇల్లే దాటలేని ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో విహారయాత్రలు, ప్రకృతి ఒడిలో సేద తీరడాలు ఒక కలే. బయటకు వెళ్తే కరోనా సోకుతుందేమోనని చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి కిటికీలోంచే బయట ఏం జరుగుతుందో చూస్తున్నారు. మరి ఈ కిటికీ నుంచే ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే సింగపూర్‌కి చెందిన సోనాలీ రంజిత్.. వైష్ణవ్ బాల సుబ్రమణ్యం దంపతులకు వచ్చింది. దీంతో ‘విండో స్వాప్’ వెబ్సైట్ రూపొందించారు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడో ఎవరి ఇంట్లోనో ఉన్న కిటికీ నుంచి బయటి దృశ్యాలను చూడొచ్చన్నమాట. వింతగా ఉంది కదా! ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ‘ఓపెన్ ఏ న్యూ విండో సమ్‌వేర్ ఇన్ ది వరల్డ్’అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే దేశ విదేశాల్లోని నగరాల్లో ఉండే ఓ ఇంటి కిటికీ ప్రత్యక్షమవుతుంది. ఆ కిటికీలోంచి బయట దృశ్యాలు కనిపిస్తాయి.
ఉదాహరణకు ‘ఓపెన్ ఏ న్యూ విండో సమ్‌వేర్ ఇన్ ది వరల్డ్’ క్లిక్ చేయగానే యూఎస్‌లోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఓ ఇంటి కిటికీ కనిపిస్తుంది. అందులో నుంచి బయట ఉన్న భవంతులు, వర్షం కురుస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మరోసారి బటన్ నొక్కితే పొర్చుగల్లోని వీఎన్ గెయియా నగరంలోని మరో ఇంటి కిటికీ వస్తుంది. అందులో నుంచి బయట రోడ్లు.. వాహనాల రాకపోకలు కనిపిస్తాయి. ఇలా ‘ఓపెన్ ఏ న్యూ విండో సమ్‌వేర్ ఇన్ ది వరల్డ్’ బటన్ నొక్కిన ప్రతిసారీ ప్రపంచంలోని ఏదో ఒక నగరానికి చెందిన దృశ్యాలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇందుకోసం వెబ్సైట్ రూపకర్తలు మొదట దేశ విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల ద్వారా వీడియోలు చేయించి పెట్టారు. ప్రస్తుతం 15 దేశాలకు చెందిన పలు నగరాల్లోని వీడియోలు ఇందులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించే విజిటర్స్ కూడా తమ ఇంటి కిటికీ బయట దృశ్యాలను ఈ వెబ్సైట్లో పొందుపర్చొచ్చు. ఇందుకోసం హెచ్డీ క్లారిటీతో మీ కిటికీ బయటి దృశ్యాలను పది నిమిషాలపాటు చిత్రీకరించి.. మీ పేరు, నగరం.. దేశం పేర్లు జతచేసి అప్లోడ్ చేయాలి. భలే ఆలోచన కదా.. మీరూ ఒకసారి www.window-swap.comను సందర్శించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్‌లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..