Variety bill: సర్జరీ చేసేటప్పుడు ఏడ్చావ్‌.. అదనంగా బిల్లు కట్టు

ఆసుపత్రి యజమాన్యాలు బిల్లుల రూపంలో నగదు దోపిడి చేస్తాయనే ఆరోపణలు బాధితుల నుంచి వింటూనే వచ్చాం. అయితే ఈ దోపిడి మాత్రం ఊహకు కూడా అందదు. ఈ వింత అనుభవం అమెరికాలోని మిడ్జి అనే మహిళకు ఎదురైంది.

Published : 02 Oct 2021 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్పత్రి యాజమాన్యాలు బిల్లుల రూపంలో నగదు దోపిడి చేస్తాయనే ఆరోపణలు బాధితుల నుంచి వింటూనే వచ్చాం. అయితే ఈ దోపిడి మాత్రం ఊహకు కూడా అందదు. ఈ వింత అనుభవం అమెరికాలోని మిడ్జి అనే మహిళకు ఎదురైంది. పుట్టు మచ్చలు తొలగించుకునేందుకు మిడ్జి ఇటీవలే సర్జరీ చేయించుకుంది. చికిత్స అంతా సాఫీగానే సాగినా.. బిల్లు చూసిన ఆమె ఒక్కసారిగా ఖంగుతుంది. ‘‘సర్జరీ చేసే సమయంలో మీరు ఏడ్చారు. అందుకే అదనంగా రూ.815 ఛార్జ్‌ కట్టండి. ఈ ఛార్జీని కూడా మీ బిల్లులోనే కలిపేశాం. దీంతో మొత్తం రూ.17,316 అయ్యింది. వెంటనే కట్టండి’’ అని ఆమె చేతిలో రసీదు పెట్టగా.. ఖంగుతిన్న ఆమె తన ఆవేదనను ఇదేం విడ్డూరం అంటూ ట్వీట్‌ చేసింది. అంతే ఈ పోస్ట్‌ పెట్టిన కొద్దిసేపటికే వైరలై మొత్తం రెండు లక్షల లైక్స్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చి పడ్డాయి. ‘‘పేషెంట్స్‌ నుంచి దోచుకునేందుకు లెక్కలేనన్ని మార్గాలను అమెరికాలోని పలు ఆస్పత్రి యాజమాన్యాలు అన్వేషించాయి’’ అంటూ ఆగ్రహించిన ఓ నెటిజన్‌ ఇలా ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని