
Updated : 11 Nov 2021 01:46 IST
Karnataka: రైల్వే పోలీసుల అప్రమత్తత.. మహిళకు తృటిలో తప్పిన ప్రమాదం
శివమెుగ్గ: రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శివమెుగ్గ రైల్వేస్టేషన్లో ఓ మహిళ.. కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించింది. ఈ క్రమంలో కాలు జారి ఒక్కసారిగా ఫ్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన రైల్వే పోలీసులు వేగంగా స్పందించారు. బాధిత మహిళ పట్టాల వైపునకు జారిపోకుండా రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బంధువులకు వీడ్కోలు పలికేందుకు స్టేషన్‌కు వచ్చి ఆ మహిళ ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :