Tamil Nadu: 30 ఏళ్ల పాటు ఆమె.. అతడిలా..ఎందుకంటే!
పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయడానికైనా వెనుకాడరు. తండ్రి లేకపోయినా ఆ లోటు లేకుండా పెంచిన తల్లులు ఉంటారు. కానీ తన కూతురుని చూసుకునేందుకు ఓ తల్లి 30 ఏళ్లు తండ్రిలాగే జీవించింది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయడానికైనా వెనుకాడరు. తండ్రి లేకపోయినా ఆ లోటు లేకుండా పెంచిన తల్లులు ఉంటారు. కానీ తన కూతురుని చూసుకునేందుకు ఓ తల్లి 30 ఏళ్లు తండ్రిలాగే జీవించింది. తండ్రిలా మారడమంటే కూతురు ఆలనాపాలనా విషయంలోనే కాదు.. వేషధారణలో కూడా తండ్రిలాగే మారిపోయింది ఈ తల్లి. ప్యాంటు, షర్టు వేసుకుని, క్రాప్ హెయిర్ కట్ చేయించుకుంది. ఆమె ఎవరో కాదు..తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్(57).
ఎందుకు మారిందంటే!
పెచ్చియామ్మాల్కి 20 ఏళ్ల వయసులో పెళ్లి అయింది. వైవాహిక బంధంలో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే భర్తను కోల్పోయింది. ఆ సమయానికి ఆమె గర్భవతి. బిడ్డపైనే కొండంత ఆశలతో జీవనం సాగిస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు, తన కూతురును బతికించుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చింది. మగాడిలా వేషధారణ మార్చుకుని, ముత్తు అనే పేరుతో 30 ఏళ్ల పాటు జీవనం కొనసాగించింది. ఒంటరిగా జీవించే తనకు ఇదే సరైన నిర్ణయమని భావించింది. ముత్తుగా పేరు మార్చుకుంది. మకాం మార్చింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ పూట గడుపుకునేది. ఎక్కడికి వెళ్లినా మగాడిలాగే పరిచయం చేసుకునేది. టీ, పరోట షాపుల్లో పని చేస్తూ మాష్టారుగా పేరు పొందింది. కష్టపడి కూతురి పెళ్లి చేసింది.
అయితే ఆధార్ కార్డులో ‘ముత్తు’ అని ఉండటంతో పింఛను రావడం లేదని ఆమె కూతురు తెలిపింది. పింఛను వస్తే తల్లికి ఉపయోగకరంగా ఉంటుందని ఆమె భావించారు. దీంతో మళ్లీ ఆమె మహిళగా తనను తాను తిరిగి పరిచయం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.