Tragedy: అయ్యో.. కూతురి పెళ్లి కోసం లాకర్‌లో ₹18లక్షలు దాస్తే... చివరకు..!!
కూతురి పెళ్లి కోసం ₹18లక్షలను బ్యాంకు లాకర్‌లో దాచుకున్న ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆ డబ్బును చెదలు తినేయడంతో ఆమె విస్తుపోయారు.
మొరాదాబాద్: అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురి పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టి పెద్ద మొత్తాన్ని బ్యాంకు లాకర్‌లో దాచుకున్న ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. లాకర్‌లో దాచుకున్న మొత్తం ₹18లక్షల కరెన్సీ నోట్లకు చెదలు పట్టి పాడైపోయాయి. ఊహించని పరిణామం ఎదురవ్వడంతో ఆమె విస్తుపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అల్కా పాఠక్ అనే మహిళ గతేడాది అక్టోబర్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా అషియానా బ్రాంచ్ లాకర్‌లో ₹18లక్షలు దాచుకున్నారు. అయితే, ఇటీవల బ్యాంకు అధికారులు ఆమెను సంప్రదించి లాకర్ అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేయించుకొనేందుకు, కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయించుకొనేందుకు రావాలని కోరారు.
బ్యాంక్ లాకర్ ఎక్కువ కాలం తెరవకపోతే?
ఈ క్రమంలో బ్యాంకు వద్దకు వచ్చిన అల్కా పాఠక్ తాను భద్రపరిచినవన్నీ సక్రమంగా ఉన్నయో లేదోనని చూసుకొనేందుకు లాకర్‌ను తెరిచారు. వెంటనే ఆమె లాకర్‌లో ఉన్న తన డబ్బంతా చెదలుపట్టడం చూసి విస్తుపోయారు. కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బంతా ఇలా చెదపురుగుల దాడిలో దుమ్ములా మారిపోవడంతో ఆమె పుట్టెడు దుఖఃలో మునిగిపోయారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు. తీరా ఈ విషయం బయటకు రావడం, మీడియా ఒత్తిడితో దీనిపై వారు స్పందించారు. ఈ అంశంపై తమ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్‌కు నివేదిక పంపినట్టు వెల్లడించారు.
మరోవైపు, దాచుకున్న డబ్బంతా ఇలా చెదలపాలవ్వడంతో ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు తనతో ఎలాంటి సమాచారం షేర్ చేసుకోలేదని ఆవేదన చెందారు. ఈ విషయంలో బ్యాంకు నుంచి సరైన స్పందన, సహకారం లభించకపోతే మీడియా సాయంతీసుకొని ఈ విషయాన్ని విస్తృతం చేస్తానన్నారు. అయితే, ఆ మహిళ ట్యూషన్లు చెబుతూ చిన్న బిజినెస్ చేసుకొని జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో ఎలాంటి నగదు నిల్వ చేయకూడదు. అలాగే, లాకర్‌ని ఉపయోగించే లైసెన్స్ కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వచేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే గానీ నగదును నిల్వచేయడానికి కాదని బ్యాంక్ ఆఫ్ బరోడా లాకర్ ఒప్పందంలో కూడా పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Allu arjun: వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు
-
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..
-
WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..