Andhra News: విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత.. వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న మహిళలు

మానసిక వికలాంగురాలిపై విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై తెదేపా సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి.

Updated : 22 Apr 2022 14:28 IST

విజయవాడ: మానసిక వికలాంగురాలిపై విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై తెదేపా సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. పోలీసుల అలసత్వంతోనే ఇది జరిగిందని వారంతా ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పలువురు మహిళలు విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రి ప్రధాన మార్గం వద్ద మహిళలు, నేతలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

మరోవైపు బాధితురాలిని పరామర్శించేందుకు ఆసుపత్రి వద్దకు చేరుకున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మను మహిళలు అడ్డుకున్నారు. ఆసుపత్రి వద్ద నుంచి వెళ్లిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ఆమెను ఆసుపత్రిలోనికి తీసుకెళ్లారు. చంద్రబాబు, వాసిరెడ్డి పద్మ సమక్షంలో విజయవాడ సీపీ కాంతిరాణా టాటాపై బాధిత కుటుంబసభ్యులు మండిపడ్డారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని