Viral: ప్రొజెక్టర్‌ స్క్రీన్‌గా బెడ్‌షీట్‌.. ఇది కదా వాడకమంటే..!

ప్లాస్టిక్‌ నీళ్ల ట్యాంకును కత్తిరించి అందులో వాహనాలు పార్క్‌ చేయడం.. బాటిల్‌కు రంధ్రాలు చేసి షవర్‌లా స్నానానికి ఉపయోగించడం.. ఇస్త్రీ పెట్టెపై దోశలు వేయడం.. ఇలాంటివి సోషల్‌మీడియాలో మనం చాలానే చూశాం.

Published : 21 Mar 2023 04:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్లాస్టిక్‌ నీళ్ల ట్యాంకును కత్తిరించి అందులో వాహనాలు పార్క్‌ చేయడం.. బాటిల్‌కు రంధ్రాలు చేసి షవర్‌లా స్నానానికి ఉపయోగించడం.. ఇస్త్రీ పెట్టెపై దోశలు వేయడం.. ఇలాంటివి సోషల్‌మీడియాలో మనం చాలానే చూశాం. ఇలా ఏదైనా వస్తువును వాడే విషయంలో మన తర్వాతే. ఈ విషయంలో భారతీయుల తర్వాతే అంటూ చాలా పోస్టులను మనం చూసే ఉంటాం. తాజాగా ఓ ఇల్లాలు తన సృజనాత్మకతను ఉపయోగించింది. ఇంట్లో బెడ్‌షీట్‌ ప్రొజెక్టర్‌ స్క్రీన్‌గా మార్చేసింది. ‘ఇదిగో మా ఆవిడ ఓ రూ.20వేలు మిగిల్చింది’ అంటూ ఆమె భర్త పోస్ట్‌ చేయడంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

గ్రీకీ రంజిత్‌గా సుపరిచితమైన టెక్‌ యూట్యూబర్‌ రంజిత్‌ ఇటీవల ట్విటర్‌ పోస్ట్‌ పెట్టారు. ప్రొజెక్టర్‌ స్క్రీన్‌ కోసం వెతుకుతుండగా.. తన భార్య తెల్లని బెడ్‌షీట్‌కు నాలుగు క్లిప్‌లు తగిలించి స్క్రీన్‌గా మార్చేశారని పేర్కొన్నారు. సాధారణంగా రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు అవ్వాల్సిన చోట.. ఆ మొత్తం తన భార్య మిగిల్చారంటూ పోస్ట్‌ చేశారు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘ఆలోచన బాగుంది’ అంటూ కొందరు పోస్ట్‌లు పెట్టారు. ‘ఇంకెందుకు ఆలస్యం బ్రదర్‌.. ఆవిడను ఎంచక్కా షాపింగ్‌కు తీసుకెళ్లండి’ అంటూ కామెంట్లు పెట్టారు. ‘లుంగీలు, పాత దుస్తులు కూడా వాడుకోవచ్చన్నమాట’ అంటూ మరొకరు కామెంట్‌ పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు