23ఏళ్లుగా శాండ్‌విచ్‌లనే తిన్న యువతి.. మారిందిలా..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అని ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యానికి గురవుతాము.

Published : 28 May 2022 02:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యానికి గురవుతాం. ఇందంతా ఇప్పుడెందుకు అనుకోకండి.. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ యువతి దాదాపు 23 ఏళ్ల నుంచి శాండ్‌ విచ్‌, చిప్స్‌ మాత్రమే తింటోంది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఓ అరుదైన వ్యాధి వచ్చిందని ఇలానే తింటూ ఉంటే ఆమె బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. అసలు ఎవరు ఆ యువతి.. ఏంటి ఆ కథ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

ఇంగ్లాండ్‌ చెందిన జియో శాడ్లర్‌ అనే యువతి 23 ఏళ్లుగా కేవలం శాండ్‌విచ్‌లు, కరకరలాడే చిప్స్‌ మాత్రమే తింటోంది. ఆమెకు రెండు, మూడేళ్ల వయసున్నప్పుడు ఇవి తినడం అలవాటు అయింది. తల్లిదండ్రులు కూడా లంచ్‌ బాక్స్‌లో వీటినే పెట్టి పంపేవారు. క్రమంగా ఆమెకు ఇతర ఆహార పదార్థాలపై ఇష్టం పోయింది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ‘మల్టిపుల్‌ స్లెరోసిస్‌’ అనే వ్యాధి సోకిందని జీవితాంతం చికిత్స తీసుకోవాల్సిందేనని తెలిపారు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను హిప్నాథెరపిస్ట్‌ దగ్గరికి తీసుకువెళ్లి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. కౌన్సిలింగ్‌ అనంతరం పండ్లు, కూరగాయలు తినడం ఆరంభించింది. తొలిసారి భోజనం చేసిన ఆమె తన అనుభూతిని  పంచుకుంది. ‘స్ట్రాబెరీలు ఇంత రుచిగా ఉంటాయని అనుకోలేదు. మిగతా ఆహారపదార్థాలను కూడా తినడానికి నేను ఎదురుచూస్తున్నాను. వచ్చే ఏడాది జరగనున్న నా పెళ్లిలో నేను వింధుభోజనం చేస్తాను’ అని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని