రోడ్డుపైనే గర్భిణి ప్రసవం

సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ అస్పత్రికి తాళం వేసి ఉండటంతో రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. న్యాలకల్ మండలం రేచింతల్‌కు చెందిన పూజితకు పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఉదయం 7:30 సమయంలో మీర్జాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

Updated : 10 Jun 2021 01:54 IST

న్యాలకల్: సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ అస్పత్రికి తాళం వేసి ఉండటంతో రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. న్యాలకల్ మండలం రేచింతల్‌కు చెందిన పూజితకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఉదయం 7:30 సమయంలో మీర్జాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండటం, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అప్పటికే నొప్పులు భరించలేకపోతున్న మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. అనంతరం తల్లీబిడ్డను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. మీర్జాపూర్‌లో 24 గంటలు సేవలు అందించేలా 30 పడకలతో ఆస్పత్రిని నిర్మించినా ఉపయోగం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని