మహిళలు ఫోన్‌ కొంటే 10శాతం రాయితీ

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8న ఏపీలో మొబైల్‌ ఫోన్లు కొనే మహిళలకు సీఎం జగన్‌ 10 శాతం రాయితీ ప్రకటించారు. సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఏపీ సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. ఈ

Published : 05 Mar 2021 01:18 IST

అమరావతి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8న ఏపీలో మొబైల్‌ ఫోన్లు కొనే మహిళలకు సీఎం జగన్‌ 10 శాతం రాయితీ ప్రకటించారు. సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఏపీ సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి వనిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని సూచించారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌కు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో రెండు వేల స్టాండ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 8న సెల్‌ఫోన్లు కొనే మహిళలకు 10 శాతం రాయితీ, దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే మహిళలకు 10 శాతం రాయితీ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మహిళలకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. మహిళా భద్రత, సాధికారతపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని సీఎం జగన్‌ అన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని