బాల మేధావులు.. ఆ చిన్నారులు!

ఒకరికేమో అక్షరాలు నేర్చుకునే వయసు కూడా లేదు అయినా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. మరొకరికేమో స్థానికంగా గూగుల్ గర్ల్‌ అనే గుర్తింపు వచ్చింది. చిన్నవయసులోనే ఆ చిన్నారులు చేస్తున్న అద్భుతాలు ఏమిటీ?

Updated : 27 Dec 2022 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరికేమో అక్షరాలు నేర్చుకునే వయసు కూడా లేదు అయినా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. మరొకరికేమో స్థానికంగా గూగుల్ గర్ల్‌ అనే గుర్తింపు వచ్చింది. చిన్నవయసులోనే ఆ చిన్నారులు చేస్తున్న అద్భుతాలు ఏమిటి? వారికి అంత గుర్తింపు రావటానికి కారణమేమిటి? తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకేం చదివేయండి..

రేపల్లె బుడతడు.. రెండేళ్ల వయసులోనే!

మొదటి ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు హెత్విక్‌ సుబ్రహ్మణ్యం. గుంటూరు జిల్లా రేపల్లె. బొమ్మలతో ఆడుకునే రెండేళ్ల వయసులోనే రాష్ట్రాలు, దేశాల రాజధానుల పేర్లను అనర్గళంగా చెప్పేస్తున్నాడు. పద్యాలు, శ్లోకాలు కూడా వల్లించగలడు. ఏదైనా ఒకసారి చెబితే చాలు.. మళ్లీ ఎప్పుడు అడిగినా ఠక్కున చెప్పేస్తాడు. తన జ్ఞాపక శక్తితో అబ్బుర పరుస్తున్న ఈ బుడతడు తెలుగు బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అతడి విజయాలపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అతడిని శాస్త్రవేత్తగా చూడాలని అనుకుంటున్నారు.

గూగుల్‌ గర్ల్..!
సాధారణంగా నాలుగేళ్ల వయసులో ఎవరైనా ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకుంటారు. కానీ.. ఒడిశాకు చెందిన జిగ్యాన్స అద్భుత ప్రతిభతో అదరగొడుతోంది. చిన్నవయసులోనే ఒడిశాలోని జిల్లాల పేర్లు, దేశంలోని రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లు చకచకా చెప్పేస్తోంది. అంతేకాదు కవులు, వారు చేసిన ప్రముఖ రచనలు, శాస్త్రవేత్తల పేర్లు, వారి ఆవిష్కరణలు, ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను ఏమాత్రం తడబడకుండా చెబుతూ చూసిన వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పసివయసులోనే అపారమైన ప్రతిభ కనబరుస్తున్న ఈ చిన్నారిని స్థానికులు గూగుల్ గర్ల్‌ అని పిలుస్తున్నారు. ఈ చిన్నారుల పలుకులు వినాలనుందా అయితే ఈ కింది వీడియోలను చూసేయండి..!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు