CM Jagan: ప్రపంచ బ్యాంక్‌ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ

ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం సీఎం జగన్‌తో భేటీ అయ్యింది. ప్రజారోగ్యం,విద్య, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించారు.

Published : 28 Mar 2023 00:36 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan)తో ప్రపంచ బ్యాంక్‌ (World Bank)ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. భారత్‌లో ప్రపంచ బ్యాంక్‌ డైరెక్టర్‌ అగస్టే కుమే సారథ్యంలో జరిగిన ఈ భేటీలో.. ప్రపంచ బ్యాంక్‌ ఆర్థిక సాయంతో నడుస్తున్న ప్రజారోగ్యం, విద్య, నీటిపారుదల ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులు తెచ్చామన్నారు. రాష్ట్రంలోని అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రపంచబ్యాంక్‌ సమగ్ర అధ్యయనం చేయాలని కోరారు. ఈ అంశంలో మరింత భాగస్వామ్యం కావాలని ప్రపంచ బ్యాంక్‌ను కోరినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్నామన్న జగన్‌.. వైద్యశాఖలో 40 వేల మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నామని, ఉన్నత విధానాలు, సాంకేతికతలో సహకారం అందించాలని ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులను జగన్‌ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు