Updated : 17/07/2021 15:46 IST

World Emoji Day: ఎక్కువగా వాడే ఎమోజీలు ఏవంటే?

 ఈరోజు ‘వరల్డ్‌ ఎమోజీ డే’
 భారతీయులు ఎక్కువగా ఏ ఎమోజీస్‌ను వాడుతున్నారంటే..

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: వీటిని నొక్కితే చాలు.. మనలోని సంతోషం, బాధ, కన్నీళ్లు, ఆనందబాష్పాలు, కోపం అన్ని ఇట్టే పలికేస్తాయి. మనం చెప్పాలనుకునే భావాలను ఇట్టే చెప్పేస్తాయి. ఇంతకీ అవేంటని అంటారు కదూ! అవే ఎమోజీలు. మనం వాడే వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో మాటల బదులు చోటు సంపాదించుకున్నాయి. అంతలా మన జీవితంలో భాగమైన వాటికి ఈరోజు కాస్త స్పెషల్‌ డే. ఎందుకంటారా! ఈరోజు ‘వరల్డ్‌ ఎమోజీ డే’ కాబట్టి. ఏటా జులై 17న ఈరోజు పండుగలా నెటిజన్లు జరుపుకొంటారు. ప్రస్తుతం ట్విటర్‌లోనూ #EmojiDay అంటూ ట్రెండింగ్‌లో వీటి గురించి ఆసక్తిర విషయాలను ట్విటర్‌ షేర్‌ చేసింది.. .అవేంటంటే

* ఈఏడాది జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకూ ట్విటర్‌లో భారతీయులు వాడిన ఎమోజీలను రికార్డ్‌ చేయగా.. అందులో 1,46,000 మంది ట్విటర్‌ వినియోదారులు ట్వీట్‌ చేసిన 6,95,000 సంభాషణలను పరిశీలించింది.

ఇందులో 93శాతం పాజిటివ్‌, న్యూట్రల్‌ సెంటిమెంట్‌తో రికార్డు అయినట్లు వెల్లడించింది.

భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే ఎమోజీల్లో కొన్ని...

😂  పడి పడి నవ్వే ఎమోజీ

🙏  ప్రార్థిస్తున్న ఎమోజీ

😭  ఏడుస్తున్న ఎమోజీ

😊  నవ్వే ఎమోజీ

😍  హార్ట్‌ ఐస్‌ ఎమోజీ

👍 థంబ్సప్‌

🔥  ఫైర్‌

🥺 వేడుకునే ఎమోజీ

ఇక వివిధ క్యాటగిరీల్లో ప్రాచుర్యం పొందిన ఎమోజీలు
 

స్పొర్ట్స్‌, ఫిట్‌నెస్‌

💪 ఫ్లెక్స్‌డ్‌ బైసెప్స్‌ (కండలు)

🏃  రన్నింగ్‌

🏏 క్రికెట్‌ బాల్‌

🤸 కార్ట్‌వీల్‌

🏄  సర్ఫర్‌

హాబీస్‌, యాక్టివిటీస్‌

📷 కెమెరా, ఫొటోగ్రఫీ

💃 డ్యాన్సింగ్‌

🎧 హెడ్‌ఫోన్స్‌, మ్యూజిక్‌

📚 బుక్స్‌, రీడింగ్

🎨 కలర్‌ పాలెట్‌, ఆర్ట్‌

ఫుడ్‌ అండ్‌ డ్రింక్‌

🎂 బర్త్‌డే కేక్‌

🍻 బీర్‌ మగ్స్‌

🍫 చాక్లెట్‌ బార్‌

🍟 ఫ్రెంచ్‌ ఫ్రైస్‌

🍭 లాలీపప్‌

అప్రిషియేషన్‌ (ప్రశంసలు)

💯  100 పాయింట్స్‌

💐 బొకే

👏 క్లాపింగ్‌ హ్యాండ్స్‌

🐐 గోట్‌ ఎమోజీ

🥇 మెడల్‌ ఎమోజీ

నేచర్‌ (ప్రకృతి)

🌹  రోజ్‌

🌅 సన్‌రైజ్‌

🌞 సన్‌ విత్‌ ఫేస్‌

🌟 గ్లోయింగ్‌ స్టార్‌ 

🌸 చెర్రీ బ్లూసమ్‌

ఇవే కాదు! మహమ్మారి కరోనా వచ్చాక మరికొన్ని ఎమోజీలు వినియోగం పెరిగింది.. అవి కూడా చూసేయండి

🙏 ప్రేయర్‌, ప్రార్థన

😷  వేర్‌ ఏ మాస్క్‌

🆘 ఎస్‌ఓఎస్‌ (సమ్‌వన్‌ ఓవర్‌ షోల్డర్‌)

🏥 హాస్పిటల్‌ 

ఇవే కాదు.. వీటి యువతలో వీటి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మరీ అప్‌డేటడ్‌ ఎమోజీలు ఆమోదం పొందాక ios 15  వాడుకలోకి తీసుకువచ్చింది.

* సెల్యూటింగ్‌ ఫేస్‌

* బైటింగ్‌ లిప్‌

* లో బ్యాటరీ ఎమోజీ, మెల్టింగ్‌ ఫేస్‌, ఓపెన్‌ ఐస్‌..

ఇవన్నీ 2021 చివర్లో కానీ, 2022 ప్రారంభంలోకి కానీ రానున్నాయి. అంతే కాదు.. ఎమోజీలు స్టికర్ల రూపంలో మనకి మనం రూపొందించుకునేలా ఐఫోన్‌ ఒక ఫీచర్‌ను తీసుకురానుంది. వీటిని ఐదు భాగాలుగా విభజించగా.. సుమారు 40 ఎమోజీలు మన మూడ్‌, స్టైల్‌ను ప్రభావితం చేసేలా వివిధ రంగుల్లో కనువిందు చేయనున్నాయి. ఇక మనకి నచ్చిన స్పోర్ట్స్‌ టీమ్‌, యూనివర్సిటీ ఎమోజీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక కళ్లజోళ్లకి సంబంధించి హార్ట్‌షేప్, స్టార్‌, రెట్రో షేప్‌.. ఇలా మనకు నచ్చిన ఫ్రేమ్‌, లెన్స్‌లో ఎంచుకునే ఆప్షన్‌ను తీసుకురానుంది. ఇక ఎమోజీ యూజర్లకు  ఆకట్టుకునేందుకు ఎమోజీ యాంథమ్‌ని విడుదల చేశాడు అమెరికా గేయ రచయిత, గాయకుడు జాన్‌థాన్‌ మ్యాన్‌. ఆ వీడియోను మీరూ చూసేయండి.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని