ప్రపంచంలోకెల్లా ఖరీదైన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌!

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ధర మహా అయితే ₹ 200 వరకూ ఉంటుంది. కానీ ఈ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ఖరీదు ₹ 15,000

Published : 16 Jul 2021 23:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ధర మహా అయితే ఓ ₹200 వరకూ ఉంటుంది. కానీ ఈ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ఖరీదు ₹15,000 (200 డాలర్లు). న్యూయార్క్‌లోని జూన్‌ 13న ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ డే సందర్భంగా ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వీటిని తయారుచేశారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌గా ఇవి గిన్నిస్‌ రికార్డు సృష్టించాయి. వీటిని తయారు చేయడానికి ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కోసం ప్రత్యేకంగా పండించిన చిప్పర్‌బెక్‌ బంగాళదుంపలు, డోమ్‌ పెరిగ్నాన్‌ షాంపైన్‌, జె లెబ్లాంక్‌ ఫ్రెంచ్‌ షాంపైన్‌ ఆర్డెన్నే వెనిగర్‌, స్వచ్చమైన బాతు కొవ్వు, తినదగిన 23 క్యారెట్ల బంగారపు పొడి.. మొదలైన ఖరీదైన వంట సామగ్రిని ఉపయోగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని