Tallest Woman: ప్రపంచంలోనే ఎత్తైన మహిళ ఖాతాలో మరో మూడు గిన్నిస్‌ రికార్డులు..

ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్న రుమీసా గెల్గి(25) ఖాతాలో మరో మూడు గిన్నిస్‌ రికార్డులు చేరాయి.

Published : 04 May 2022 21:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్న రుమీసా గెల్గి(25) ఖాతాలో మరో మూడు గిన్నిస్‌ రికార్డులు చేరాయి. ప్రపంచంలో జీవించి ఉన్న మహిళల్లో అత్యంత పొడవైన చేతివేళ్లు(11.2 సెంటీమీటర్లు), పొడవైన చేతులు(24.93సెంటీమీటర్లు(కుడిచేయి), 24.26(ఎడమచేయి)), పొడవైన వీపు(59.90సెంటీమీటర్లు)తో గెల్గి రికార్డు సృష్టించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు 2022 ఫిబ్రవరిలో సర్వే చేపట్టగా అందులో గెల్గి విజేతగా నిలిచారు. టర్కీకి చెందిన ఈ మహిళ 2014లో 215.16 సెంటీమీటర్లతో ప్రపంచంలో జీవించి ఉన్న ఎత్తైన టీనేజర్‌గా రికార్డు నెలకొల్పారు.

1997లో జన్మించిన రుమీసా గెల్గి ఓ అరుదైన వ్యాధి కారణంగా ఇలా పొడవు పెరుగుతున్నారు. ఆమె వీవర్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఇది పెరుగుదలను వేగవంతం చేస్తుంది. అనారోగ్యం కారణంగా ఆమె ఎక్కువ శాతం చక్రాల కుర్చీలోనే గడుపుతారు. వాకర్‌ సాయంతో కొద్ది దూరం మాత్రమే నడవగలరు. గెల్గి మాట్లాడిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు యూట్యూబ్‌లో విడుదల చేసింది. ‘నేను పుట్టుకతోనే ఓ అరుదైన వ్యాధి బారినపడ్డాను. దాని కారణంగా చిన్నతనంలో వేధింపులకు గురయ్యాను. కానీ పొడవుగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి.. ఇలా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను సొంతం చేసుకోవడం’. అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని