Health: యోగా చేయండి.. జ్ఞాపక శక్తి పెంచుకోండి

మతి మరుపు ఓ వరం అని ఓ కవి మాట ..చెడు విషయాలను వదిలించుకోవడానికి బాగానే ఉంటుంది..కానీ అసలు విషయం గుర్తు పెట్టుకోవడానికి వీలు లేకుండా కొంతమందికి మతిమరుపు వస్తే ఎన్నో చిక్కులు ఎదురవుతాయి. 

Published : 30 Jun 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మతి మరుపు ఓ వరం అని ఓ కవి మాట.. చెడు విషయాలను వదిలించుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అసలు విషయం గుర్తు పెట్టుకోవడానికి వీలు లేకుండా కొంతమందికి మతిమరుపు వస్తే ఎన్నో చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు చదివిన విషయం మరచిపోతే.. పెద్దవాళ్లు చేయాల్సిన పనులను గుర్తు  చేసుకోలేకపోతే ఎన్నో అనర్థాలు ఎదురవుతాయి. వీటిని అధిగమించడానికి యోగా ఒక చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతారు. మతి మరుపును తగ్గించి జ్హాపకశక్తిని పెంచడానికి ఉన్న యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి యోగా గురువు ఆర్‌ ఆర్‌ ప్రసాద్‌ తెలిపారు.

విద్యార్థుల నుంచి మొదలు ఉద్యోగులు, వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరికీ జ్ఞాపకశక్తి ఎంతో అవసరం. సాంకేతికత పెరిగిన కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. దీన్ని పెంచుకోవడానికి సూపర్‌ బ్రెయిన్‌ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యోగాతో మెదడు శక్తిమంతంగా తయారవుతుంది. చదివినా, విన్నా, చూసినా బాగా గుర్తు పెట్టుకునే విధంగా మెదడు సిద్ధమవుతుంది. భ్రామరీ ప్రాణాయామం చాలా శక్తిమంతమైనది. తేనెటీగ శబ్దంలాగా ఉంటుంది. ఇది మెదడును చాలా చైతన్యం చేస్తుంది. సుఖాసనం, పద్మాసనంలో దీన్ని చేయొచ్చు. ఈ రెండింటినీ  పిల్లలు, పెద్దలు రోజుకు 14 సార్లు చేయాలి. 21 రోజుల నుంచి 41 రోజుల్లోనే మెదడు పని చేసే విధానంలో మార్పు వస్తుంది. జ్ఞాపకశక్తి చాలా మెరుగుపడుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని