
Published : 12 Jul 2021 01:16 IST
యోగాతో కీళ్ల నొప్పులు మాయం!
ఇంటర్నెట్ డెస్క్: వయసుతోపాటు కీళ్లు అరిగిపోతూ నొప్పులు బాధిస్తూ ఉంటాయి. కొందరికి వయసుతో సంబంధం లేకుండా ఒంట్లోని కీళ్లన్నీ నొప్పులతో పోటెత్తుతూ ఉంటాయి. ఈ రకమైన కీళ్ల నొప్పులు చాలావరకు డ్రొమాటిజం అనే జబ్బు మూలంగా వస్తూ ఉంటాయి. డ్రొమాటిజాన్నే వాడుకలో కీళ్ల వాతం అని పిలుస్తారు. ఈ వాతంతో బాధపడుతున్నప్పుడు కీళ్లన్నీ వాపు, మంట, నొప్పులతో బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మత్స్యాసనం, పవనముక్తాసనం, వాయుముద్ర ఆసనాలతో కీళ్ల కండరాలపై ప్రభావం చూపి కీళ్ల నొప్పులు తగ్గిస్తాయని వివరిస్తున్నారు. క్రమం తప్పకుండా చేస్తే వాతం నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. ఈ యోగాసనాలపై పూర్తి విరాలకు కింది వీడియోను చూడండి...
ఇవీ చదవండి
Tags :