Yoga Day: తెలంగాణావ్యాప్తంగా.. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో యోగాభ్యాసం

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది.

Updated : 22 Jun 2024 20:54 IST

హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) పురస్కరించుకుని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ (Art of living)’ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణావ్యాప్తంగా 100కుపైగా ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 60 వేలమంది యోగా సాధకులు, ఔత్సాహికులు ఇందులో భాగమై.. రాష్ట్ర ప్రజలకు యోగాభ్యాసం, శారీరక, మానసిక ఆరోగ్యంపై ఉన్న మక్కువను చాటిచెప్పారు.

తెలంగాణ పోలీసు అకాడమీ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు యూనిట్లు, 11 తెలంగాణ ప్రత్యేక పోలీసు బెటాలియన్లు, మూడు కేంద్ర రిజర్వు బలగాల యూనిట్లలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అంబర్‌పేట పోలీస్ యూనిట్‌లో 800 మంది యోగా చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి పాల్గొన్నారు.

తెలంగాణ పోలీస్ అకాడమీలో 1200 మంది పోలీసులు యోగా చేశారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో 100 మంది ఉద్యోగులు, మూడు సైనికదళ యూనిట్ల సిబ్బంది యోగాభ్యాసంలో పాల్గొన్నారు.

తెలంగాణా హైకోర్టు ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్ అరాధే, సహ న్యాయమూర్తులు, హైకోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని