Over Sleep: అతి నిద్ర వదిలి పెట్టడం లేదా? ఈ సమస్యకు ఇలా చెక్‌పెట్టండి..!

రాత్రి పూట నిద్ర పట్టకపోవడంతో చాలా మంది బాధపడుతుంటారు.. కానీ కొంతమంది మాత్రం అతినిద్రతో......

Published : 29 Aug 2022 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాత్రి పూట నిద్ర పట్టకపోవడంతో చాలా మంది బాధపడుతుంటారు.. కానీ కొంతమంది మాత్రం అతినిద్రతో సతమతమవుతారు. ఇంట్లోనే కాదు.. కార్యాలయాల్లోనూ ఉన్నట్టుండి నిద్రలోకి జారుకుంటారు. ఇదీ ఒక సమస్యే సుమా..! ఇలా నిత్యం ఇబ్బంది పడుతున్నపుడు కొన్ని యోగాసనాలు వేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రముఖ యోగా గురువు ఆర్‌.ఆర్‌. ప్రసాద్‌ వివరించారు.

ఈ యోగాసనాలతో ప్రయోజనం

యోగాలో కొన్ని ఆసనాలు అతినిద్ర సమస్యను పరిష్కరించడానికి తోడ్పడతాయి.  శరీరం ఉత్తేజితమవుతుంది. కొన్ని ప్రత్యేకమైన సూర్య నమస్కారాలు, ప్రాణముద్ర చేయడంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. సూర్యనమస్కారాలను ఉదయం, సాయంత్రం 12 సార్లు చేయాలి. ఇలా చేయడంతో ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఉత్సాహంతో దినచర్యను కొనసాగిస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని