Yoga Utsav: ఎల్బీ స్టేడియంలో ‘యోగా ఉత్సవ్‌’

యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘యోగా ఉత్సవ్‌’ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌తో కలిసి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated : 27 May 2022 11:39 IST

హైదరాబాద్‌ : యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘యోగా ఉత్సవ్‌’ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌తో కలిసి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దాదాపు వంద రోజుల ముందు నుంచే వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియా, అమెరికాతోపాటు పాలు దేశాల్లోని 75 ప్రాంతాల్లో యోగా ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 25 రోజుల ముందుగా ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహస్తున్నామని.. వచ్చే నెల 21న ట్యాంక్‌బండ్‌ వద్ద భారీ ఎత్తున యోగా దినోత్సవాన్ని జరుపుతామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు తదితరులు పాల్గొని ఉత్సాహంగా యోగా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని