YOGA: నెలసరి సమస్యకు యోగాతో పరిష్కారం

ప్రతి నెల నెలసరి సమస్యతో మహిళలకు చిక్కులే. అధిక రుతుస్రావం, పొత్తికడుపులో నొప్పి, రోజుల తరబడి రక్తస్రావం, తలనొప్పి, కాళ్లు లాగడం, శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తడి వేధిస్తుంటాయి

Published : 01 May 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెలసరి సమస్యతో మహిళలకు చిక్కులే. అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి, కాళ్లు లాగడం, శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తిడి వేధిస్తుంటాయి. నెలసరి సమస్యలకు చాలా మంది మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది మందులను ఆశ్రయిస్తే.. కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటారు. వ్యాయామం చేయడమే కాదు..యోగాసనాలు కూడా బాగా తోడ్పడుతాయని యోగా గురువు ఆర్‌ఆర్‌ ప్రసాద్‌ చెబుతున్నారు. 

ఇలా చేస్తే నెలసరి చిక్కులు మాయం

* వాతావరణ సమస్యలో, మారుతున్న జీవనశైలితో మహిళల్లో నెలసరి సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి.

* ప్రతి నెల కాకుండా రెండు, మూడు నెలలకోసారి నెలసరి రావడం, కొంతమందిలో నెలకు ముందే రావడం, మరికొంతమందికి నెలలో ఎక్కువ రోజులు రక్తస్రావం అవుతోంది.

* సహజ సిద్ధమైన కొన్ని యోగాసనాలతో నెలసరిని సరి చేయడానికి వీలుంది.

* ధనురాసనం, అపానముద్రతో గర్భసంచి, పొట్ట కండరాలు, థైరాయిడ్‌ గ్రంథి, వెన్నెముకపై పూర్తి ప్రభావం ఉంటుంది.

* ధనురాసనం ప్రతి రోజూ ఐదుసార్లు చేస్తే మహిళలు పూర్తిగా నెలసరి సమస్యలు తగ్గిపోతాయి.

* అపానముద్రను ప్రతి రోజు పది నిమిషాలు చేస్తే నెలసరి సమస్యలే కాదు..వెన్నెముక, థెరాయిడ్‌ ఇతర సమస్యలను తొలగించుకోవచ్చు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని