మెడను ప్రకటనలిచ్చే హోర్డింగ్‌గా మార్చేశాడు!

సంస్థలైనా, వ్యక్తులైనా ప్రకటనలు, ప్రచారాలు ఉంటేనే ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. అందుకే టీవీ, దారుల వెంట అడ్వర్టైజ్‌మెంట్‌ హోర్డింగ్స్‌ ఇలా అనేక విధాలుగా ప్రకటనలు ఇస్తుంటారు. అయితే, ఈ సాంకేతిక కాలంలో సోషల్‌మీడియా.. ప్రచారానికి ప్రధానాయుధంగా మారిపోయింది. దీంతో చాలా మంది వ్యక్తులు సోషల్‌మీడియాలో

Updated : 18 Aug 2022 16:13 IST

(ఫొటో: ఒనొకొండా ఇన్‌స్టా)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు తమ శరీరంపై నచ్చిన వ్యక్తుల పేరు, డిజైన్‌, ఇతర సింబాలిక్‌ పదాలను ఎంతో ఇష్టంగా టాటూ వేయించుకుంటారు. కానీ, ఓ వ్యక్తి తన మెడపై పలు సంస్థలు, వ్యక్తుల సోషల్‌మీడియా ఐడీలను పచ్చబొట్టుగా వేయించుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు. 

సంస్థలైనా, వ్యక్తులైనా ప్రకటనలు, ప్రచారాలు ఉంటేనే ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. అందుకే టీవీ, రహదారుల వెంట ప్రకటనలు ఇస్తుంటారు. అయితే, ఈ సాంకేతిక కాలంలో సోషల్‌మీడియా.. ప్రచారానికి ప్రధానాయుధంగా మారిపోయింది. దీంతో కొంత మంది వ్యక్తులు సోషల్‌మీడియాలో ముందు ఫేమస్‌గా అయి, ఆ తర్వాత పలు సంస్థల ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే, రష్యాకు చెందిన ఎగొర్‌ ఒనొప్కో మాత్రం మరో అడుగు ముందుకేసి సాహసం చేస్తున్నాడు. తన మెడనే ప్రకటనలిచ్చే హోర్డింగ్‌గా మార్చాడు. కంపెనీలు, ప్రచారం కోరుకునే వ్యక్తుల సోషల్‌మీడియా ఐడీలను తన మెడపై శాశ్వత పచ్చబొట్టుగా వేయించుకొని ఆదాయం పొందుతున్నాడు. 

రష్యాలోని వ్లాదివోస్టోక్‌లో నివసించే ఎగొర్‌ ‘ఒనోకొండా’ పేరుతో బ్లాగర్‌గా ఈ మధ్యే పాపులారిటీ తెచ్చుకున్నాడు. దీంతో ఇటీవల ఎగొర్‌ ఓ ప్రకటన ఇచ్చాడు. తన మెడపై శాశ్వత పచ్చబొట్టుతో ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎవరైనా సరే వారి సోషల్‌మీడియా ఐడీలను ప్రకటనగా ఇవ్వొచ్చని చెప్పాడు. ఒక్క ఐడీని పచ్చబొట్టుగా వేసుకుంటే 1,350 యూఎస్‌ డాలర్లు(దాదాపు రూ.98వేలు) రుసుముగా తీసుకుంటానని వెల్లడించారు. దీంతో అతడి మెడపై ప్రకటనలు ఇచ్చేందుకు పలువురు ముందుకు రావడం విశేషం. ఇప్పటి వరకూ అతడు తన మెడకు ఒకవైపు పది సోషల్‌మీడియా ఐడీలు పచ్చబొట్టుగా వేయించుకొని రూ.9.8లక్షలు సంపాదించాడు. మరోవైపు డిజిటల్‌ క్రియేటర్‌ జాన్‌ స్టాష్‌కెవిచ్‌ పేరు ఉంటుంది. మరో తొమ్మిది ప్రకటనలకు అవకాశం ఉండగా.. వాటిని రష్యాతోపాటు ఉక్రెయిన్‌, బెలారస్‌ దేశాలకు చెందిన సంస్థలకు, వ్యక్తులకు విక్రయించేశాడు. ఈ విషయం తెలిసి కొందరు ముక్కున వేలేసుకుంటే.. మరికొందరు అతడి తెలివితేటలను ప్రశంసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని