Andhra News: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ.. థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడి హల్‌చల్‌!

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణా థియేటర్‌ వద్ద ఓ యువకుడు గన్‌తో హల్‌చల్‌ చేశాడు.

Published : 26 Mar 2022 01:43 IST

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణా థియేటర్‌ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. గన్‌తో ఫొటోలకు ఫోజులిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రదర్శితమవుతుండగా.. ఆ యువకుడు తెర ముందు గన్‌తో కేరింతలు కొడుతూ అటూ ఇటూ తిరిగాడు. అతడి తీరుతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం యువకుడు థియేటర్‌ బయట గన్‌తో తిరుగుతుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. అయితే విచారణలో అది డమ్మీ తుపాకీగా తేల్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని