Duvvada: రైలు-ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కున్న యువతి.. గంటన్నర పాటు నరకయాతన
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ యువతి నరకయాతన అనుభవించింది. రెస్క్యూ సిబ్బంది గంటన్నరపాటు శ్రమించి ఆమెను రక్షించారు.
కూర్మన్నపాలెం: విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో (Duvvada Railway Station) ఓ యువతి నరకయాతన అనుభవించింది. రైలు-ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోవడంతో గాయాలపాలైంది. వివరాల్లోకి వెళితే.. అన్నవరానికి చెందిన శశికళ (20) దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (Guntur Rayagada Express)లో ఆమె దువ్వాడ చేరుకుంది.
స్టేషన్‌లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల వద్ద ఉండిపోవడంతో తీవ్ర గాయాలతో గగ్గోలు పెట్టింది. దీంతో రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కున్న చోట ప్లాట్‌ఫామ్‌ను కట్ చేశారు. గంటన్నర పాటు శ్రమించి ఆమెను బయటకు తీసి చికిత్స కోసం షీలా నగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: క్యాప్షన్లేని రష్మిక ఫొటోలు.. కేతిక ‘ఫిబ్రవరి ఫీల్స్’!
-
Politics News
Yuvagalam-Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర.. ప్రచారరథం సీజ్ చేసిన పోలీసులు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ వచ్చేసింది.. దరఖాస్తు చేశారా?
-
Movies News
OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్
-
Sports News
Virat Kohli: ‘నువ్వు వెళ్లే మార్గం నీ మనస్సుకు తెలుసు.. అటువైపుగా పరుగెత్తు’: విరాట్ కోహ్లీ
-
General News
Polavaram: పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదు: కేంద్ర జలశక్తిశాఖ స్పష్టత