యూట్యూబ్‌లో వీళ్లెంతో పాపులర్!
క్షణాల్లో ఓ ప్రదేశానికి వెళ్లిపోవాలంటే.. నిమిషాల్లో కావాల్సిన సమాచారం తెలుసుకోవాలంటే.. నచ్చిన వస్తువు, మెచ్చిన వంట, కావాల్సిన సినిమా, నవ్వేందుకు కామెడీ... ఇప్పుడన్నింటికీ ఒకే చిరునామా యూట్యూబ్. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఎంత మంది సబ్‌స్ర్కైబర్లున్నారు? మరి దేశంలో ఎక్కువ సబ్‌స్ర్కైబర్లు గల వ్యక్తిగత యూట్యూబర్లు ఎవరో తెలుసా? వారెలాంటి వీడియోలు అప్‌లోడ్ చేస్తారు? వారి యూట్యూబ్ విజయ రహస్యం ఏంటి? మీరే చదివేయండి.
చిన్న వయసులోనే..
దేశంలో అత్యధిక సబ్‌స్ర్కైబర్లు గల వ్యక్తిగత యూట్యూబర్లలో ముందున్నాడు 20ఏళ్ల అజయ్ నగర్. తన యూట్యూబ్ ఛానల్.. క్యారీమినాటీ. ప్రస్తుతం దీనికి 25.7మిలియన్ల సబ్‌స్ర్కైబర్లున్నారు. పదేళ్ల వయసులోనే యూట్యూబర్‌గా మారాడీ కుర్రాడు. అప్పటి నుంచి వీడియోలు అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. చదువంటే ఆసక్తి లేని అజయ్ చిన్నతనంలో బాగా వీడియో గేమ్స్ ఆడేవాడు. తర్వాత దాన్నే కెరీర్‌గా మార్చుకున్నాడు. మొదట ఫుట్‌బాల్ ట్యుటోరియల్, గేమ్‌ప్లే వీడియోలు అప్‌లోడ్ చేస్తుండేవాడు. తదుపరి ఛానల్ పేరు మార్చి రోస్టింగ్, మిమిక్రీ, కామెడీ స్కిట్లు, లైవ్ గేమింగ్, రోజూ వారీ అంశాలపై వీడియోలను అప్‌లోడ్ చేసేవాడు. కొంతకాలం క్రితం ‘యూట్యూబ్ వెర్సస్ టిక్‌టాక్-ది ఎండ్’ అంటూ తను చేసిన వీడియో యూట్యూబ్-ఇండియాలో అత్యధిక లైక్‌లు పొందింది. ఎంతో ఆదరణ పొందిన నాన్-మ్యూజిక్ వీడియోగా నిలిచింది. తర్వాత కొన్ని కారణాలతో యూట్యూబ్ దాన్ని తొలగించింది. టైమ్ మ్యాగజైన్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్- 2019లో ప్రపంచంలో రాజకీయాలు, మ్యూజిక్, ఇతర రంగాల్లో నయా మార్గాలు సృష్టించుకుంటూ ఎదుగుతున్న 10మంది యువతలో క్యారీ పేరు ఉండటం విశేషం.
ఏడాదిన్నరలో 10మిలియన్లు
దేశంలో మొట్టమొదటిసారిగా 20మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు దాటిన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ అమిత్ భదానాది. ప్రస్తుతం 21.4మిలియన్ల సబ్‌స్ర్కైబర్లున్నారు. 2018లో యూట్యూబ్ గ్లోబల్ టాప్ 10 వీడియోల లిస్ట్‌లో అమిత్ వీడియో నిలిచింది. ఇతరులను నవ్వించడం అంటే అమిత్‌కి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కామెడీ వీడియోలు, పేరడీలు తీస్తూ ఇండియాస్ ఫన్నియస్ట్ వీడియో యూట్యూబర్‌గా గుర్తింపు పొందాడు. తన మిత్రుని కోసం తీసిన ఓ డబ్‌స్మాష్ కామెడీ వీడియో విపరీతంగా వైరల్‌గా మారడంతో అలాంటి వీడియోలు మరిన్ని చేయాలనుకున్నాడు. అందుకు ఫేస్‌బుక్ పేజీ, యూట్యూబ్‌ని వేదికగా మార్చేశాడు. ఛానల్ మొదలెట్టిన ఏడాదిన్నరలోనే కోటి మంది సబ్‌స్ర్కైబర్లను సంపాదించుకున్నాడు. మొదట్లో వీడియోల్లో తన ముఖాన్ని చూపేందుకు సిగ్గుపడే అమిత్, తన స్నేహితుల ప్రోత్సాహం వల్ల అసలైన కంటెంట్ కోసం ఆత్మవిశ్వాసంతో ముందడుగువేశాడు. ఇక తన నిజజీవిత సంఘటనల ఆధారంగా పరిచయ్ పేరుతో ఈ మధ్య ఓ మ్యూజిక్ వీడియోనూ విడుదల చేశాడు.
యూట్యూబే ఇళ్లుగా..
వాళ్ల సొంత థియేటర్‌లో రోజూ బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాడు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. పెద్దయ్యాక యాక్టర్ అవ్వాలనే కల.. అదే ఇప్పుడు ఆశిష్ చంచలానీని దేశంలో అత్యధిక సబ్‌స్ర్కైబర్లు గల వ్యక్తిగత యూట్యూబర్‌లలో ఒకడిగా నిలిపింది. తన యూట్యూబ్ ఛానల్.. ఆశిష్ చంచలానీ వైన్స్. ప్రస్తుతం దీనికి 2 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లున్నారు. తన ఎదుగుదల వెనక నాన్న ప్రోత్సాహం చాలా ఉందంటాడు 26ఏళ్ల ఆశిష్. ఏదో కంటెంట్ ఇస్తూ సరిపెడదాం అనుకునేకంటే తనకంటూ ప్రత్యేక కంటెంట్ క్రియేట్ చేసి క్రియేటివ్ వీడియోలు ఉంచడం ఆశిష్ ప్రత్యేకత. ఎప్పటికప్పుడు సరికొత్త కామెడీ కంటెంట్‌ని తన యూజర్లకు అందిస్తాడు. కేవలం కామెడీతోనే కాదు, షార్ట్ ఫిల్ములు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో తన ఛానల్ అభిమానులకు వినోదం పంచుతున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తమ సినిమా ప్రచారం కోసం ఈ యూట్యూబర్‌ని కలుస్తుంటారంటే తనకున్న ప్రజాదరణను అర్థం చేసుకోవచ్చు.
మొదటి పదిమిలియన్ల రికార్డు
ఐదేళ్ల క్రితం కశ్మీర్ వరదల్లో తన కొడుకును కోల్పోయిన తల్లిని ఓ రిపోర్టర్ అడిగిన సున్నితమైన ప్రశ్నలకు ఓ వీడియో రూపంలో బుద్ధి చెప్పాడు భువన్ బామ్. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తరవాత అదే తనని యూట్యూబర్‌గా మారేలా స్ఫూర్తినిచ్చింది. తన ఛానల్ పేరు బీబీ కా వైన్స్. ప్రస్తుతం ఇందులో 19.1మిలియన్ల సబ్‌స్ర్కైబర్లున్నారు. దేశంలో కోటి మంది సబ్‌స్ర్కైబర్లను దాటిన మొదటి వ్యక్తిగత యూట్యూబర్‌గా భువన్ రికార్డులకెక్కాడు. పట్టణ యువకుని జీవన శైలిని తెలిపే వినూత్న వీడియోలను చిత్రీకరించి అప్‌లోడ్ చేస్తుంటాడు. తను గాయకుడు, గేయ రచయిత కూడా! చిన్నతనం నుంచే తనకి మ్యూజిక్ అంటే ఆసక్తి. సంగీతంలోనే అనేక అవకాశాలు చేజిక్కించుకున్నాడు. లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికుల కోసం నిధులను సేకరించేందుకు లైఫ్‌లైన్ ఆఫ్ సొసైటీ అనే పేరుతో ఓ షార్ట్ వీడియోనూ రూపొందించాడు.
టెక్నాలజీ గురువు.. 2800 వీడియోలు
2020లో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో నమోదైన ఇండియన్ యూట్యూబర్ గౌరవ్ చౌదరీ. టెక్నాలజీ అప్‌డేట్లు, సరికొత్త స్మార్ట్‌ఫోన్లు, టెక్ రివ్యూలు తదితర వీడియోల్లో ముందుంటుంది గౌరవ్ యూట్యూబ్ ఛానల్. కేవలం ప్రొడక్ట్ రివ్యూలు మాత్రమే కాకుండా కాన్సెప్టుని సింపుల్‌గా వీక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పడం తన ప్రత్యేకత. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ఛానల్ ప్రస్తుతం 19.1మిలియన్ల సబ్‌స్ర్కైబర్లతో దూసుకుపోతోది. 10మిలియన్లు దాటిన మొదటి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్‌గా రికార్డుకెక్కింది. హిందీ టెక్ అప్‌డేట్స్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా! ప్రస్తుతం ఇందులో 2800కి పైగా వీడియోలున్నాయి.
ఈ పేరు వినే ఉంటారు
మోడలింగ్ ప్రపంచంలో ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ మొదలెట్టి ప్రస్తుతం ఓ పారిశ్రామికవేత్తగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మార్గదర్శిగా, యూత్‌ఐకాన్‌గా మారిన సందీప్ మహేశ్వరి పేరు ఇది వరకు వినే ఉంటారు. తన పేరున ఉన్న యూట్యూబ్ ఛానల్‌లో ప్రస్తుతం 16.9మిలియన్ల సబ్‌స్ర్కైబర్లున్నారు. ఇదో నాన్-ప్రాఫిట్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా తన సబ్‌స్ర్కైబర్లలో ఆత్మవిస్వాసం నింపుతాడు. యువత లక్ష్యాల్ని చేరుకునేలా ప్రోత్సహిస్తాడు. వారి సమస్యలను వారే పరిష్కరించుకునేలా సూచనలిస్తాడు. మోటివేషన్ వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటాడు. యువతతో సందీప్ నిర్వహించే ప్రత్యేక సెమినార్‌లు ఆకట్టుకుంటాయి. వారి ప్రశ్నలకు సందీప్ ఇచ్చే సమాధానాలు యువతని ఉత్సాహపరుస్తాయి. వారి లక్ష్యాల్ని చేరుకునేలా ప్రోత్సహిస్తాయి.
చిత్రాలు: వారి అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
-
India News
I-Day: స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్‌లో ఉగ్రముఠా కుట్రలు భగ్నం!
-
Sports News
Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
-
Viral-videos News
Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
-
General News
Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
- Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
- Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్.. ఝున్‌ఝున్‌వాలా చెప్పిన విజయసూత్రాలివే!