Guinness Record: గాలిలో నిలిచిన హెలికాప్టర్‌ను పట్టుకొని పుల్‌అప్స్‌!

ఎగురుతున్న హెలికాప్టర్‌ నుంచి వేలాడుతూ.. ఒక్క నిమిషంలో అత్యధిక పుల్‌అప్స్‌ చేసి ఓ వ్యక్తి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు..........

Published : 06 Aug 2022 16:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎగురుతున్న హెలికాప్టర్‌ నుంచి వేలాడుతూ.. ఒక్క నిమిషంలో అత్యధిక పుల్‌అప్స్‌ చేసి ఓ వ్యక్తి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. హెలికాప్టర్‌ను పట్టుకొని వేలాడుతూ గాల్లోనే నిమిషంలో 25 పుల్‌అప్స్‌ చేసి ఈ రికార్డు సృష్టించాడని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను  తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.

నెదర్లాండ్స్‌కు చెందిన స్టాన్‌ బ్రౌనీ మిత్రుడు అర్జెన్‌ అల్బెర్స్‌తో కలిసి ఫిట్‌నెస్‌కు సంబంధించి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజా ఫీట్‌ చేయాలని వారు భావించారు. దీనికోసం కొద్దిరోజులుగా ప్రాక్టీస్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే జులై 6న బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో గిన్నిస్‌ రికార్డ్స్‌ అధికారుల సమక్ష్యంలో ఈ ఫీట్‌ సాధించారు. ఇందుకు స్టాన్‌ బ్రౌనీ, అర్జెన్‌ అల్బెర్స్‌ పోటీ పడగా.. బ్రౌనీ నిమిషంలో 25 పుల్‌అప్స్‌ చేసి రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 23 పుల్‌అప్స్‌తో ఆర్మేనియాకు చెందిన రోమన్‌ సరద్యాన్‌ పేరిట ఉన్న రికార్డును ఇతడు బద్దలుకొట్టాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని